పార్టీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
హైదరాబాద్: 64వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జాతీయ జెండాను తెదేపా ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ నేత నాయిని జాతీయ జెండాను ఎగరవేశారు. భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు జాతీయ జెండాను ఆదిష్కరించారు.



