పార్థసారిధికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి మద్దతుగా హైదర్‌గూడలో ఎంఎల్‌ఏ పాత క్వార్టర్స్‌ ఎదుట బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. క్వార్టర్స్‌లోకి చొచ్చుకుపోయేందుకు సంఘ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదపులోకి తెచ్చారు.