పార్లమెంటులో త్వరలో ఆహారభద్రత బిల్లు : సోనియా

ఢిల్లీ: త్వరలో ఆహారభద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని యూపీఏ అధ్యక్షురాలు సోనియా అన్నారు. శనివారం ‘ దిల్లీ అన్నశ్రీ యోజనా పథకాన్ని’ ప్రారంభించిన సందర్భంగా సోనియా మాట్లాడుతూ నగదు బదిలీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా డబ్బు అందుతుందన్నారు.