పార్లమెంటు ఎన్నికలకు ముంద మహోధ్యమం: బాబా
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల కంటే ముందు భారీ ఉద్యమాన్ని తల పెట్టనున్నట్లు యోగాగురు రాందేవ్ బాబా ప్రకటించారు. పోలీసుల విజ్ఞప్తిని విస్మరిస్తూ రాత్రంతా అంబేద్కర్ స్టేడియంలోనే దీక్ష కొనసాగించిన ఆయన మంగళవారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదురోజులుగా కొనసాగిస్తున్న తన మద్దతుదారులకు సంకేతాలిచ్చారు. దీంతోపాటు భవిష్యత్తు కార్యచరణపై తన సహచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాందేవ్ బాబాకు భాజపా, జేడీ (యు), ఆకాలీదళ్, జనతాపార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.