పార్లమెంట్ సమావేశాలపై దృష్టి పెట్టాలి
ఆయా సమస్యలపై కేంద్రంతో పోరాడాలి
ఇందుకు కెసిఆర్ నాయకత్వం వహిస్తే మంచిది
విపక్షాల ఐక్యతతోనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యం
న్యూఢల్లీి,నవంబర్9 జనం సాక్షి : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి జరగనున్న నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు, సాగు ట్టాలపై ఉమ్మడి పోరాటాకు విపక్షాలు సిద్దం కావాలి. దీనిపై పోరాడుతామని ప్రకటించిన సిఎం కెసిఆర్ కూడా ఇందుకు తగిన విధంగా ముందుకు రావాలి. ఆయనే నాయకత్వం వహిస్తే మరీ మంచిది. ఇది ప్రజల సమస్యలుకనుక అనేకానేక సమస్యలపై తక్షణం స్పందించడం మంచిది. సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరుగుతాయి. రాజకీయంగా కీలకమైన
ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఉంది. దీని తరువాత బ్జడెట్ సెషన్ జరుగుతుంది. ఇది కేంద్ర బ్జడెట్ ఆమోదం కోసం కొన్ని రోజుల పక్రియల తరువాత విరామం కోసం వాయిదా వేయబడుతుంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, వంట నూనె ధరల పెరుగుదల, కాశ్మీర్లో పౌరులపై మిలిటెంట్ల దాడులు, లఖింపూర్ ఖేరీలో రైతుల దారుణ హత్య, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు వంటి అంశాలు కీలకం
కానున్నాయి. పెగాసస్ స్పైవేర్ సమస్యపై ప్రభుత్వం నుండి సమాధానాలు కోరుతూ, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయగా, కేంద్రం మొండిగా వ్యవహరించడతో ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. మునుపటి సమావేశాల మాదిరిగానే శీతాకాల సమావేశాలు కరోనా ప్రోటోకాల్‌లకు కట్టుబడి జరగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్, వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ను కూడా కుదించారు. ఇకపోతే అనేక సమస్యలపై కెసిఆర్ ఇప్పటికే తన వైఖరిని ప్రకటించారు. ఈ క్రమంలో రానున్న శీతాకాల సమావేశాలను సవాలుగా తీసుకుని ప్రజలపక్షం వహిస్తే మంచిది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా.. రాజకీయాలు అవసరమైనప్పుడు కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం పేరిట డ్రామాలు చేస్తారని మండిపడ్డారు. దేశంలో 65 వేల నుంచి 70వేల టీఎంసీల నీళ్లు ఉంటే 40వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, బీజేపీ నాయకులు సన్నాసుల్లా చూస్తూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్టాల్ర మధ్య నీటియుద్దాలు జరుగుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని మండిపడ్డారు. ’దేశానికి మంచినీళ్లు దిక్కులేవు.. సాగునీళ్లు దిక్కులేవని అన్నారు. నష్టంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను బంద్ చేస్తున్నమంటే ఆర్థం చేసుకోగలుగుతామని, కానీ లాభాలు వస్తున్న ఎల్ఐసీ లాంటి సంస్థలను ఎందుకు ప్రైవేట్‌పరం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీ లాంటి సంస్థలు ప్రభుత్వానికి డివిడెండ్ కూడా ఇస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వరంగంలో ఉంటే రిజర్వేషన్లు వస్తయి, పది మందికి అవకాశం దొరుకతదని చెప్పారు. దేశాన్ని మొత్తం క్రాప్ కాలనీ కింద విభజించాలని, డిమాండ్ ఉండే పంటలే పండిరచాలని సూచించానని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలను పండిరచే విజ్ఞానం రైతులకు ఇవ్వాలని, దీనిద్వారా వ్యవసాయ రంగం మంచిగా ఉంటదని ప్రధానికి,నీతి ఆయోగ్‌కు చెప్పానన్నారు. ఫసల్ బీమా యోజనకు దిక్కేలేదని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రంలోనే ఆ పథకానికి దిక్కులేదని, కావాలంటే గుజరాత్ పోయి చూద్దామని సవాల్ విసిరారు.మన దేశం కన్నా చాలా తక్కువగా ఉండేదని సీఎం తెలిపారు. అక్కడ వ్యవసాయ భూమి మన కన్నా తక్కువేనని చెప్పారు. కానీ నేడు చైనా ఎక్కడ, మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నించారు. ఇందుకు కారణం దేశంలో అవలంబిస్తున్న తప్పుడు విధానాలేనని పునరుద్ఘా టించారు. మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని కానీ మన దేశానికి వచ్చే పర్యాటకు లెంత మంది అని ప్రశ్నించారు. దేశ యువతలో ఆశాంతి నెలకొందని కేసీఆర్ చెప్పారు. చైనాలో లింగ, కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పనిచేస్తుంటారని తెలిపారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు అధికారమివ్వకపోయినా దొడ్డిదారిలో ఆ రాష్టాల్ల్రో బీజేపీ గవర్నమెంట్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.ప్రభుత్వం తెలంగాణను తాము తీర్చిదిద్దిన తీరును చూసి కేంద్ర మంత్రులే ప్రశంసి స్తున్నారని, ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్వయంగా కేంద్ర మంత్రి ప్రశంసించారని, అయినా తాము ఏనాడూ డబ్బా కొట్టుకోలేదని వివరించారు. ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ సాధించిన పురోగతిని ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్ర మైనా సాధించిందా అని కెసిఆర్ ప్రశ్నించారు. దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు, యువకుల భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాలి. నూతన ఆర్థిక విధానాలు రావాల్సిన అవసరమున్నదని ప్రకటించిన సిఎం కెసిఆర్ తన వైఖరికి అనుగుణంగా జాతీయస్థాయిలో విపక్షాలను ఐక్యం చేయగలగాలి.