పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

52మంది మృతి

వందమందికి పైగా తీవ్ర గాయాలు

మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం

గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం కురిపిస్తుంది.  అదివారమిక్కడ మీడియా భవంతిపై ఇజ్రాయిల్‌ జరిపిన వైమానికి దాడిలో సుమారు ఆరుగురు పాత్రికేయులు గాయపడినట్లు తెలుస్తుంది. ఉత్తర గాజాలో జరిపిన మరోదాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ”గాజా నగరానికి పొరుగునున్న రిమాల్‌లో షోవా, హౌసరి భవంతిలో ఉన్న అల్‌ ఖుద్‌స్‌ టీవీ కార్యలయంపై ఇజ్రాయిల్‌ యుధ్ద విమానాలు దాడి చేశాయి. ఈ వైమానిక దాడిలో కనీసం ఆరుగురుపాత్రీకేయిలు గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అష్రప్‌ అల్‌ఖుద్రా తెలిపారు. ప్రత్యేక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి భవనం తీవ్రంగా దెబ్బతింది. తొలి వైమానిక దాడి జరిగిన వెంటనే పాత్రీకేయిలు భవంతిని ఖాళీ చేశారు. అనంతరం కనీసం రెండు దాడులు జరిగాయి. గాజాకు ఉత్తరంగా నివాసాలపై ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు చేపట్టిన వేర్వురు దాడుల్లో ఇద్దరు మరణించారు. పది మంది గాయపడ్డారు. బియత్‌, బియిత్‌ హనున్‌లో ఇళ్లపై జరిగిన రెండు వేర్వురు దాడుల్లో ఇద్దరు యువకులు మరణించారు. పది మంది గాయపడ్డారని సమాచారం.