పాషాఖాద్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: చార్మినార్‌ శానసభ్యుడు పాషాఖాద్రీపై కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్‌ పోలీసులను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాషాఖాద్రీకి  వ్యతిరేకంగా జిల్లా న్యాయస్థానంలో దాఖలయిన పిటిషన్‌పై సెక్షన్‌ 121, 295ఏ, 298, 153, 153ఏ,120బీ, 124ఏ, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.