పీఆర్టీయు అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి

మునిపల్లి (జనంసాక్షి మార్చ్ 04): ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆర్ టి యు బలపరిచిన అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం నాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్, మల్లికార్జునపల్లి, మునిపల్లి, ఖమ్మంపల్లి ఉన్నత పాఠశాలలలో పిఆర్టియు సంఘం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించి పీఆర్టీయూ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధానకార్యదర్శి సంగమేశ్వర్, నాయకులు సత్యనారాయణ, సుజాఉద్దీన్, రాజేశ్వర్, ప్రవీణ్, రమేష్, రాజురాథోడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.