పుస్తక పఠనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది.
పుస్తక పఠనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. జిల్లా విద్యాధికారి రమేష్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 25. (జనంసాక్షి). పుస్తక పఠనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గ్రంథాలయానికి 50వేల రూపాయల విలువైన పుస్తకాలను ప్రకాశం గ్లోబల్ ఎన్నారై ఫోరం నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నేషనల్ బుక్ ట్రస్ట్ తెలంగాణ సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందిస్తుందని అన్నారు. పుస్తక పఠనం అలవర్చుకొని విద్యార్థులు తమ ఆలోచనలు ఉన్నతంగా తీర్చిదిద్దుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పత్తిపాక మోహన్ ను ఆత్మీయంగా సత్కరించారు. కార్యక్రమంలో మారసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగొండ రవి, 29వ వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరబ్రహ్మమూర్తి, పాతూరు మహేందర్ రెడ్డి, పాకాల శంకర్ గౌడ్, దేవత ప్రభాకర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.