పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి.

 నర్సాపూర్. మార్చి , 1, ( జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు
అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్యతరగతి పేద ప్రజల పై ఎంతో ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల కు నడ్డి ఎదిగే విధంగా ధరలను పెంచడం సమంజసం కాదని అన్నారు. నిరసన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, పాక్స్ చెర్మెన్ లు,ఎంపీటీసీ లు, సర్పంచు లు,మహిళా సంఘాలు, రైతు సంఘాల నాయకులు, ఆత్మ కమిటీ చెర్మెన్ లు,డైరెక్టర్ లు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లొ ఆత్మ కమిటీ చేర్మెన్ గొర్రె వెంకట్ రెడ్డి, పాక్స్ చెర్మెన్ వెంకట్ రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.