పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి –  సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డిమాండ్

 టేకులపల్లి, మార్చి 4( జనం సాక్షి ): పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా టేకులపల్లి మండల కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుల సుందర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో టేకులపల్లి మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను 6 నెలలకు ఒకసారి పెంచుతూ పేద ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని దుయ్యపట్టారు. ప్రజా ప్రభుత్వమని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో . మండల కమిటీ నాయకులు బానోతులింగ, యువజన సంఘం నాయకులు ధారావత్ మంగు తదితరులు పాల్గొన్నారు.