పెంచిన మందుల (ఔషదాల) ధరలను వెంటనే తగ్గించాలని అతహర్ డిమాండ్..
పెంచిన మందుల (ఔషదాల) ధరలను వెంటనే తగ్గించాలని అతహర్ డిమాండ్…. భువనగిరి టౌన్ జనం సాక్షి:–లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు రాయితీలిస్తూ పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పన్నుల భారం మోపుతూ మందుల (ఔషదాలు) ధరలను పెంచటం సిగ్గుచేటు అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా భువనగిరి లో అతహర్ విలేకరుల తో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం మోపడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిందని అన్నారు.అది చాలక నేడు సాధారణ,మధ్యతరగతి ప్రజలు జ్వరం ,నొప్పులకు వాడే ఔషదం (టాబ్లెట్ ) పారాసెటామాల్ ధరలు సైతం 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ప్రజలు కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రజలపై పన్నుల,అధిక ధరల భారాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు,బహుళజాతి సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చి,ఆ లోటు పూడ్చడానికి సాధారణ,మధ్యతరగతి ప్రజలపై అధిక బరాన్నీ మోపుతున్నారని దుయ్యబట్టారు.అది చాలక నిత్యం రోగాలతో (బిపి,షుగర్,కొలెస్ట్రాల్, శ్వాస కోశ,మూత్రపిండాలు సమస్యలు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలతో) సాహసం చేస్తున్న ప్రజలకు మరింత భారంగా ధరల పెరుగుదలతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని అన్నారు.857 రకాల మందులపై 12 శాతం ధరలు పెంచుతున్నట్లు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) చేసిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అతహర్ డిమాండ్ చేశారు. ధరలు పెంచడం అంటే పేదలకు వైద్య సదుపాయాలను దూరం చేయడమే అవుతుందని మండిపడ్డారు. అవకాశం దొరికిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురించేస్తుందని వాపోయారు .కేంద్ర ప్రభుత్వం పెంచిన మందుల ధరలను తగ్గించే వరకు ఆందోళనలు చేపడుతామని అతహర్ హెచ్చరించారు.