పెరల్స్‌ ఆగ్రో కార్పొరేషన్‌పై సీఐడీ కేసు నమోదు

హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారం పేరుతో డొపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన పెరల్స్‌ ఆగ్రో కార్పోరేషన్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో లభించిన 31 లక్షల 38 వేల రూపాయలను జప్తు చేసిన సీఐడీ వివిధ బ్యాంకుల్లోని 4 కోట్ల 44 లక్షల రూపాయలను స్తంభింప చేసింది. స్థిరాస్తి వ్యాపారం పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించడం లేదని సీఐడీకి ఫిర్యాదు అందింది. సోదాల్లో దస్త్రాలు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని సీఐడీ అదనపు డీజీ రమణమూర్తి తెలిపారు.