పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిస్థితులకు తోడు బంగారం వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31 వేలు, 22  క్యారెట్ల బంగారం రూ. 30, 250కు చేరుకుంది. వెండి ధర కిలోకు నాలుగువేల రూపాయలు పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.