పెరూలో హెలికాప్టర్ ప్రమాదం .. ఏడుగురి మృతి
లిమా : పెరూలో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆయిల్, మైనింగ్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఉత్తర పెరూలో సాన్‌జూన్ ప్రాంతంలోని ఓ భవంతిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఐదుగురు అమెరికన్లతోపాటు మరో ఇద్దరు దుర్మరణం చెందారు. హెలికాప్టర్ భవంతిని ఢీ కొన్ని అనంతరం భారీ పేలుడు సంభవించిందని ప్రత్యేక్ష సాక్షులు తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.