పేటెంట్‌ కేసులో స్యామ్‌సంగ్‌పై ఆపిల్‌ కంపెనీ విజయం

సాన్‌జోన్‌: పేటెంట్‌ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్‌ కంపెనీ స్యామ్‌సంగ్‌పై విజయం సాధించింది. తన ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐపాడ్‌ల నుంచి కీలక ఫీచర్స్‌ను కాపీ కొట్టినందుకు నష్టపరిహారంగా స్యామ్‌సంగ్‌ 1.05 బిలియన్‌ డాలర్లను ఆపిల్‌ కంపెనీకి చెల్లించాలని కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌ ఫెడరల్‌ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ప్రపంచ మార్కెట్‌లో స్యామ్‌ సంగ్‌ ఉత్పత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.