పేదలకు ఆరోగ్యాన్ని పంచిన మహానేత డాక్టర్ వైయస్సార్ : మీర్పేట్ కార్పోరేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామి డి గోపాలరెడ్డి
రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన రైతు బాంధవుడు
బడుగు బలహీన వర్గాలకు సాంకేతిక విద్యను సులభతరం చేసిన నేత
ఎల్బీ నగర్( జనం సాక్షి ) పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తన ఆరేళ్ల పాలనను డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించార ని మీర్పేట్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామి డి గోపాలరెడ్డి అన్నారు. . డాక్టర్ వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంద మల్లమ్మ చౌరస్తాలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సామిడి గొపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేదలు ఉచిత గుండె వైద్యం అందేలా చొరవ తీసుకున్న మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు వెళుతూ, హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందడం సమాజంలోని అన్ని వర్గాలకు తీరని లోటు అని పేర్కొన్నారు రైతాంగ సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న డాక్టర్ వైఎస్ఆర్ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేసి, రైతాంగం కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేశారన్నారు. ఇక పేద పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల తోపాటు, దళిత గిరిజన విద్యార్థులకు సైతం ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో ప్రవేశం లభించేలా చర్యలు తీసుకున్నారన్నారు. లక్షలాదిమంది ఇంజనీర్లను, వైద్యులను ఈ సమాజానికి అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన వినూత్న పథకాలతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎవరైనా సరే విధిగా అని వార్య పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు, పింఛనుకు సైతం నోసుకొని కోట్లాది కుటుంబాలకు విరివిగా తెల్ల రేషన్ కార్డులు, వృద్ధులు వితంతువులు వికలాంగులకు పింఛన్లను అందజేసిన మహా నేత డాక్టర్ వైయస్సార్ అని సామిడి గోపాల్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బండి రాళ్ళ రాజు ,అంజన్‌కుమార్ ,మహిళ ప్రెసిడెంట్ ప్యాట్ జ్యోతి నాయకులు నరసింహా, రేణుక, విమల ,దీక్షిత్ రెడ్డి, షా వినాయక్ ,గుమ్మడి శ్రీకాంత్ బాలకృష్ణ సిద్దూ సారి శంకర్ ఏనుగుల రవి కుమార్ యాదవ్ ,దేవరపల్లి యాది రెడ్డి ,వెంకటేష్ ,తిరుమలరెడ్డి , విక్రమ్ సంతోష్ ,అల్లం దిలీప్ ,యాదయ్య గిరియాదవ్ ,భాను సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు