పేపర్‌ లీకేజీలతో యువత భవితను నాశనం చేశారు

` ప్రజల బాధలను పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌
` 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలుచేస్తాం
` ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్‌ ఆలోచన
` మధిర కాంగ్రెస్‌ బహిరంగ సభలో ప్రియాంక
ఖమ్మం,మధిర(జనంసాక్షి): ప్రజల బాధలను కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోలేదని.. తెలంగాణ సంపదను పంచుకోవడంలోనే ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రజలే నాయకులని.. ప్రజల కంటే తాము అతీతులం అన్నట్లు మోదీ, కేసీఆర్‌ భావిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని సోనియా గాంధీ తనతో చెప్పారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని.. కానీ అలా జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా పేదలు ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని చెప్పిన బీఆర్‌?ఎస్‌? ప్రభుత్వం.. ఆ హామీని నెరవేర్చలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల బాధలను కేసీఆర్‌సర్కార్‌ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సంపదను పంచుకోవడంలోనే ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ప్రజలే నాయకులని.. ప్రజల కంటే అతీతులు అన్నట్లు మోదీ, కేసీఆర్‌ భావిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రైతులకు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్‌ హామీ నెరవేరలేదని.. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్ని పెద్ద ప్రాజెక్టుల్లో అవినీతి..: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తోందని ప్రియాంక పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవన్న ఆమె.. ప్రత్యేక రాష్ట్రం వల్ల కేసీఆర్‌ కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని.. కమీషన్ల పేరుతో ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చేశారని ఆరోపించారు. బీఆర్‌?ఎస్‌? నేతలకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేయరని మండిపడ్డారు. నిన్న రాత్రి సోనియాగాంధీతో మాట్లాడాను. ఎక్కడున్నావు అని నన్ను సోనియా అడిగారు. హైదరాబాద్‌లో ఉన్నా.. రేపు మధిర వెళ్తాను అని చెప్పాను. తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా పోరాడారో నాకు తెలుసు అని సోనియా చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవి. తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాఅని అన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు
ఖమ్మం:కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ప్రియాంక గాంధీ అన్నారు. గ్యారంటీలను అమలు చేస్తామని మా అమ్మకు చెప్పి వచ్చానని.. హావిూ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చి తీరుతాని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఆమె ప్రచారం చేపట్టారు. రోడ్‌ షోలకు విపరీతంగా ప్రజలు వచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ప్రభుత్వ మాదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, రాగానే హావిూలను అమల్లోకి తీసుకు వస్తదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పేదలకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుంద న్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ కోసం చాలా మంది పోరాటం చేశారని.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తెలంగాణలో నేను నిజాలే మాట్లాడుతున్నానని.. ఇక్కడి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటు న్నారని అన్నారు. రాష్ట్రంలో బలమైన సర్కార్‌ తోనే సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు.  రాష్టాన్న్రి  బీఆర్‌ఎస్‌ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సంపదను దోచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఉన్న సమస్యలు నాకు తెలుసన్నారు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామన్న హావిూని బీఆర్‌ఎస్‌ నెరవేర్చ లేదన్నారు. రుణమాఫీ హావిూని కేసీఆర్‌ మర్చిపోయారని చెప్పారు. సంపదను పంచుకోవడంలో బీఆర్‌ఎస్‌ నేతలు నిమగ్నమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో వేలకోట్ల దోపిడీ జరిగిందని తెలిపారు. పరీక్షలు రాసే టైంలో పేపర్లు లీకైతే.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని ప్రియాంక గాంధీ చెప్పారు. ఉద్యోగాలు రాని కుటుంబాలు ఆవేదనలో ఉన్నాయని..ªూష్ట్రంలో నోటిఫికేషన్లు వస్తాయి.. పేపర్ల లీకేజీలు అవుతాయని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక 10 ఏళ్లుగా యువత బాధపడుతున్నారని అన్నారు.