పొన్నాల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్‌: తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక  చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి కొమ్యూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దాని మీద విచారణ జరిపిన హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయంపై పొన్నాల సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, పొన్నాల పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు ఆయనకు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది.