పోలవరం టెండర్లపై సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల ఫైళ్లను స్పీకర్‌  ముందువుంచి శాసనసభా పక్షనేతల  సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. టెండర్ల ఖరారులో పారదర్శకత లోపంతో ప్రభుత్వం రూ.600 కోట్లను కోల్పోతుందని బాబు తన లేఖలోపేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియపై తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాబు కోరారు.