పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యం  సేవించిన కేసులో రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఈ తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు ఉస్మానియా అసుపత్రికి తరలించారు.