పోలీసు కుటుంబసభ్యులతో భేటీ కానున్న డీజీపీ
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన ఎపీఎస్పీ పోలీసు బెటాలియన్ కుటుంబసభ్యులతో ఈ ఉదయం 11 గంటలకు డీజీపీ భేటీ కానున్నారు. గత రెండు రోజులుగా సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలో పోలీసు కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. తమ భర్తలకు దూరప్రాంతాల్లో విధులు వేస్తూ నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంచుతున్నారని వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చలు చేపట్టారు.