పోలీస్ నియామకాల్లో ఓసి యేతర అభ్యర్థులకు అన్యాయం:బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు
ఎల్.విజయ్ కాంత్
దంతాలపల్లి సెప్టెంబర్ 9 జనం సాక్షి
ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యల్.విజయ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో బీఎస్పీ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండె రాంనర్సయ్య అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు విజయ కాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హోంమంత్రి మహమ్మద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి రాజ్యాంగ పదవుల్లో ఉంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోలీస్ నియామకాలు చేపట్టడం సిగ్గు చేటన్నారు.ఓసి అభ్యర్థులకు కటాఫ్ మార్కులను 80నుండి 60కి తగ్గించారని అదేవిధంగా బీసీ లకు 50 ,ఎస్సీ, ఎస్టీ లకు 40 కటాఫ్ మార్కులను తగ్గించాలాని డిమాండ్ చేశారు. పరీక్షల్లో నెగిటివ్ మార్కులను ఎత్తివేయాలని అన్నారు. ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులను సరిచేసి వాటికి తగిన మార్కులను కలిపి అభ్యర్థులకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అభ్యర్థుల న్యాయం చేయకపోతే బీఎస్పీ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, ఈసీ మెంబర్ ఎడ్ల శ్రీను, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శితగరం శ్రీరామ్, మండల కన్వీనర్స్ గొడిశాల కృష్ణ,మిడతపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.