ప్రకాశం బ్యారేజీ వద్ద నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టనున్న  మహాధర్నాకు తరిలివస్తున్న నేతలను రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీ వద్ద ముళ్లకంచెలను ఏర్పాటు చేసి పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమతో పాటు కార్యకర్తల్ని, రైతులను అడ్డుకున్నాఉ. దీంతో నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యారేజీ వద్దకు వెళ్లేందుకు అనుమతినివ్వకపోవడంతో దేవినేని ఉమ ధర్నాకు దిగారు.  దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకోంది. నాలుగు జిల్లాల తెదేపా నేతలు, సీపీఐ నాయకులు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన తల పెట్టిన మహధర్నాకు వేలాదిమంది కార్యకర్తలు తరలివస్తున్నారు.