ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఎందుకు?: నాగేందర్‌

హైదరాబాద్‌: ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అభిప్రాయపడ్డారు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌. రాజకీయాలకు రాకముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, ఇలాంటి కేసులు తనకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. బంజారాహిల్స్‌లోని ఇస్కాస్‌ సంస్థ బోగన్‌ అని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందునే స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, ఈ విషయంపై అక్కడికి వెళ్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దానం నాగేందర్‌ తెలియజేశారు.