ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలిఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్

-డోర్నకల్ లో   వంట మార్పు నిర్వహించి,పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
డోర్నకల్ మార్చి/3/ జనం సాక్షి న్యూస్:కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని  డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్   అన్నారు.  శుక్రవారం  పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ డోర్నకల్ పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్ వద్ద వంట మార్పు నిర్వహించి,గ్యాస్ సిలిండర్ లను పెట్టి నిరసన తెలిపి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ 400 ఉన్న గ్యాస్ ధరను 1200 వరకు పెంచిన ఘనత  కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పెట్రోల్ డీజిల్  ధరలు పెరగడం వల్ల పేద ప్రజలపై తీవ్ర భారం పడి దుర్భర  పరిస్థితి  ఎదుర్కొంటున్న రాని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా   ప్రజలు మహిళలు ఓట్ల రూపంలో  బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కరెంటు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రజల పక్షాన నిలబడిన కేసీఆర్ వాటిని తిప్పి కొట్టాడని తెలిపారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పిన మోడీ కనీసం 15 రూపాయలు కూడా వేయలేదని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, జిల్లా వ్యవసాయకమిటీ చైర్మన్ విద్యాసాగర్,ఎంపీపీ బాలు నాయక్, జెడ్పిటిసి కమల రామనాథం, మున్సిపల్  వైస్ చైర్మన్ కోటిలింగం, వివిధ గ్రామాల  సర్పంచ్లు,ఎంపీటీసీలు, అధ్యక్షులుపార్టీ అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.