ప్రజా సంక్షేమాన్ని మరిచిన సీఎం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అక్రమార్జన కోసం రాష్ట్ర మంత్రులు ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముకోసం పోలవరం నుంచి చిన్న ప్రాజెక్ట్‌ల వరకు మంత్రులు టెండర్లు వేస్తున్నారని, సీఎం కార్యలయం కేవలం అధికారాన్ని కాపాడుకోవటానికి పరిమితమైందని ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇసుక తవ్వకాలలో పాలక వర్గం మాఫియాలా ప్రవర్తిస్తొందని రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను తీస్దున్న డెంగా జ్వరాలపై వైద్యశాఖ కనీసం సమీక్ష కూడా నిర్వహిస్తోందన్నారు.