ప్రజా సమస్యలపై సిపిఎం గర్జన
ఏలూరు,ఆగస్టు29(జనం సాక్షి): ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో మహా గర్జన ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యలు కేతా గోపాలన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి విధానాలు దేశ ప్రజలను ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టాయని పేర్కొన్నారు. మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు, సత్యవరం, కొయ్యేటిపాడు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నామని తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



