ప్రణబ్‌కి మద్దతివ్వండి:శంకరావు

హైదరాబాద్‌:యపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతివ్వాలని మాజీ మంత్రి ఎమ్మేల్యే శంకర్‌రావు కోరారు సీఎల్పి కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు,మతతత్వ పార్టీలకు మద్దతు తెలపవద్దనీ లౌకిక పార్టీకి మద్దతివ్వాలని ఆయన కోరారు.ఈ మేరకు ప్రణబ్‌కు మద్దతు తెలపాలని కోరుతూ వైకాపా తెదేపా తెరాస,సీపీఐ సీపీఎం లోక్‌సత్తా ఎంఐఎం పార్టీలకు ఫ్యాక్స్‌ ద్వారా లేఖలను పంపినట్లు తెలిపారు.ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉండి గౌతంకుమార్‌కు సీనియార్టీని బట్టి ప్రమోషన్‌ కల్పిస్తే బాగుండేందని అభిప్రాయపడ్డారు.