ప్రణబ్‌ను కలిసిన పవార్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీకి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అభినందనలు తెలిపారు. సోమవారమిక్కడ ప్రణబ్‌ నివాసంలో పవార్‌ నేతృత్వంలో ఎన్‌సీపీ నాయకులు ఆయన్ను కలిశారు. వీరిలో ప్రఫుల్‌ పటెల్‌, తారిఖ్‌ అన్వర్‌, డీపీ త్రిపాఠి, సంజయ్‌ దీనా పాటిల్‌ ఉన్నారు. పవార్‌ బృందం ప్రణబ్‌తో దాదాపు పావుగంటపాటు సమావేశమైంది. రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ప్రణబ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని తెలిపిన వారిలో అనే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిలుర్‌ రెహ్మాన్‌, ప్రధాని షేక్‌ హసీనా తదితరులు ఉన్నారు.