ప్రణబ్‌ నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవు

ఢిల్లీ: ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ పత్రంలో ఎలాంటి లోపాలు లేవని ఎన్నికల అధికారులు నిర్థారించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ప్రణబ్‌ అభ్యర్థిత్వంపై సంగ్మా అభ్యంతరాలను తిరస్కరించింది.