ప్రణబ్‌ మెజార్టీ 3,97,776

న్యూడిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ 3,97,776 ఓట్ల మెజార్టీతో సంగ్మాపై విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10, 29,750విలువైన ఓట్ల పోలవ్వగా ప్రణబ్‌కు 7,13,763(69శాతం), ఎన్డీఏ అభ్యర్ధి సంగ్మాకు 3,16,987 (31శాతం) పోలయ్యాయి. 18,221 విలువైన ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు. ఈనెల 25న ప్రణబ్‌ ముఖర్జీ 13వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.