ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించాలి

 

మహబూబాబాద్/తొర్రూర్ మార్చ్ 15 (జనంసాక్షి)

ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ పేర్కొన్నారు. బుధవారం ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ తమ పిల్లలు ఉన్నత స్థాయిని చేరుకోవడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని, వారు అనుకున్నది సాధించడం కోసం ప్రతి విద్యార్థి నిరంతరం క్రమశిక్షణ కృషి పట్టుదల అంకితభావం తో విద్యను అభ్యసించి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించిన ప్రతి ఒక్క విద్యార్థి సమాజంలో ఉన్నతమైన శక్తిగా తీర్చిదిద్దబడుతాడని తెలిపారు .అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలలో నైతికత మానవీయత విలువలు అభివృద్ధి చెందుతాయని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.