ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలిప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి – ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తరచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నో అనర్థాలకు గురవుతామని అన్నారు.ప్రస్తుత సమాజంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయమిస్తుందన్నారు. నేడు జిల్లా కేంద్రంలో పలు రకాల వైద్య సేవలతో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.వైద్యాన్ని వ్యాపార కోణంలో కాకుండా మానవత దృక్పథంతో పేదలకు అందించాలని సూచించారు.అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు వల్లపు నరేష్ యాదవ్ మాట్లాడుతూ తమ హాస్పిటల్  వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వైద్య శిబిరం నేడు కూడా కొనసాగనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మారుతి, వినయ్, వెంకటేష్ , మహేష్ , రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.