ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు : పొంగులేటి

హైదరాబాద్‌: విద్యుత్‌ సంక్షోబం నుంచి గట్టెక్కిచేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ కృతజ్ఞతలు చెప్పారు. అల్మట్టి నీటితో నిండి ఉన్న తరుణంలో రాష్ట్ర అన్నదాతల అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం నీళ్లు విడిచిపెట్టాలని ఆయన కోరారు. 350 మెగావాట్లను తక్షణ అవసరాలకు అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా ఇంకా కొరత ఉందనీ, దాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నీటి వ్వవహారంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలంగాణ ప్రజా పోరు చేపట్టిన సీపీఐ నారాయణ వ్యాఖ్యలు అందర్నీ కించపరిచేలా ఉన్నాయనీ వారంతా మాటల్ని అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు.