ప్రధాని, ఆజాద్, వయలార్తో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు
న్యూఢిల్లీ: ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీ చేరడంతో రాష్ట్రరాజకీయాలు దేశరాజధానిలో వేడెక్కాయి. నిన్న పలువరు కాంగ్రెస్ నేతలను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈరోజు కూడా ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకులు ఆజాద్, వయలార్ రవితో సమావేశం కానున్నారు. మరోవైపు ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు హోంమంత్రి షిండేతో భేటీ అవుతున్నారు.