ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

share on facebook
ములుగు,ఆగస్టు21(జనం సాక్షి)
ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27ను పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్లు,టూర్ ఆపరేటర్లు,హోటల్స్, రెస్టారెంట్ స్వతంత్ర హోటల్స్ నుండి ఉత్తమ సేవల విభాగం నుండి అవార్డులను ఎంపిక చేస్తున్నారు.ఇందులో భాగంగా ఉత్తమ పర్యాటక రచన,ప్రచురణ విభాగం నుండి పర్యాటక రచనలకు రెండు అవార్డులు కేటాయించారు.పర్యాటక రంగం ఫిలిం కేటగిరి లో ఒక్కటి. ట్రావెల్ ఏజెంట్/టూర్ ఆపరేటర్ విభాగం లో రెండు,బెస్ట్ హరిత హోటల్ ఒక్కటి, బెస్ట్ దీమ్ రిసార్ట్ విభాగం లో మూడు, బెస్ట్ రెస్టారెంట్ లో మూడు, బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఒక్కటి, క్లీన్ టూరిస్ట్ డెస్టినేషన్ విభాగంలో రెండు,బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్టు విభాగం నుండి ఒక అవార్డు,బెస్ట్ కనెక్షన్ సెంటర్ విభాగం నుండి మూడు అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులు అయిన వారు సెప్టెంబర్ 4 పర్యాటక శాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో
సమర్పించాల్సి ఉంటుంది పూర్తిచేసిన దరఖాస్తులను కమిషనర్ పర్యాటక శాఖ కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం వన్ 3-5-891, టూరిజం హౌస్ హిమాయత్ నగర్ హైదరాబాద్ వారి కి అందజేయాలి. వివరాలకు 9440816065,9440816068 కి సంప్రదించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ తెలిపారు.

Other News

Comments are closed.