ప్రభుత్వం కక్ష సాధింపు చర్య
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దు చేసిన ప్రభుత్వం
ఎఐసిసి టిపీసీసీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు వీణవంక ఏప్రిల్ 1( జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్ వీణవంక మండల ఇన్చార్జులు వన్నె రాజ మల్లయ్య, కల్వల రామచంద్రం ఆధ్వర్యంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.భారత్ జూడో కార్యక్రమం చేపట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4200 కిలోమీటర్లు నడిచి లక్షలాది మందిని కలిసి వారి కష్టసుఖాలలో తెలుసుకొని నేను అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ రాబోవు 2024లో పార్లమెంటు -2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పేద ప్రజలకు మేలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక లో బహిరంగ సభలో మాట్లాడిన మాటలను వక్రీకరించి కావాలని సూరత్ హై కోర్టులో పరువు నష్టం దావా వేయించి చక చకగా రెండు సంవత్సరాల జైల్ శిక్ష విధింపుకు గురి చేసి వెంటనే లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేసి ఆ వెంటనే ఆయనకు ఇచ్చిన అధికార నివాసాన్ని కాలి చేయమని నోటీసులు జారి చేయడం ఇది బిజెపి ప్రభుత్వం మోడి – అమిత్ షా చేస్తున్న కుట్రగా భావిస్తూ ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పటానికే ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉందిఅని దేశ ప్రజలు ఉన్నారని రాబోవు రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దేధించి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఏర్పడుతుందని అప్పటివరకు బిజెపి పై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తాటాకు చప్పులకు భయపడేది లేదని స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సమాచార హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉపాధి హమీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూ సేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అన్నింటికంటే దేశ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అన్ని రంగాల్లో మనం ముందు ఉండాలని సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ’ పేద ప్రజల మేళ కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని భయపెడితే భయపదుతుందా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేద ప్రజలకు దేశ ప్రజల బాగోగులు చూసుకునేది సహాయం చేసింది చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, అడిగొప్పుల సంపత్, కట్కూరి ఉపేందర్ రెడ్డి, ఎండి సలీం, మండల రాజయ్య, అజయ్, చంద్రయ్య, తిరుపతి, తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు..