ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు : ఈటెల
హైదరాబాద్: విద్యుత్ కోతలతో తెలంగాణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీ.ల పెంపు ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉపకేంద్రాలను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుకుంటామన్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల్ని ఖండించారు. తెలంగాణను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు.