ప్రభుత్వానికి మోపిదేవి అభ్యర్థన

హైదరాబాద్‌: వాన్‌పిక్‌కు అక్రమ భూకేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేషీకీ లేఖ రాసినట్లు సమాచారం. సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన వినయ్‌ కుమార్‌కు ఈ అభ్యర్థన అందినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినంత వరకు మోపిదేవి ఏ తప్పూ చేసి వుండరని గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డ నేపథ్యంలో మోపిదేవి అభ్యర్థన పట్ల సర్కారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.