ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ శిశిర్‌ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి చిక్కిన వార్డుబాయ్‌ని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే ఈ పరిణామానికి ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మెకు ఉపక్రమించారు. వారు మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించడం గమనార్హం.