ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కుర్చీలు అందజేత

 

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గుండారం లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఇటీవల పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వెళ్లగా కళాశాల అవసరాల్లో భాగంగా కుర్చీలు కావాలని తెలియజేయడంతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వెంటనే స్పందించి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 కుర్చీలు పంపగా వాటిని జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు 10 కుర్చీలను ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్. సునంద కు కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ సర్పంచ్ నీలం సరిత, గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దామెర సంపత్, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, నాయకులు రాచకొండ రవి, మేకల సంపత్ యాదవ్, నీలం శ్రీనివాస్, గడప కృష్ణమూర్తి, దండే ఠాగూర్, కందుల మధు పిట్టల స్వామి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.