ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
జహీరాబాద్ మార్చి 16 (జనం సాక్షి ) నియోజకవర్గంలోని ఝరసంగం గ్రామంలో గురువారం రోజున పిఎసిఎస్ ఝరసంగం సొసైటీ సభ్యులకు ట్రాక్టర్ మరియు మేకలు డైలీ రుణములు రూపాయలు 4550150 మంజూరు అయిన లబ్ధిదారులకు సిడిపి చైర్మన్ ఉమాకాంత్ పటేల్ చేతుల మీదగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమాకాంత్ పటేల్ మాట్లాడుతూ పిఎసిఎస్ ఝరసంగం ద్వారా ట్రాక్టర్స్ లోన్ మేకలు లోన్ డైలీ లోన్స్ కోళ్ల ఫారం లోన్ భూమి అభివృద్ధి లోన్ రైతుల సంఘాల సభ్యులు తీసుకొనుటకు మరియు విత్తనాలు ఎరువు శనగలు కొనుగోలు కేంద్రం అన్ని విధాల సేవలు అందిస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేశారు. రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సమయంలోపల వాయిదాలు చెల్లించగలరని రైతులకు సూచించారు. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ ఝరసంగం చైర్మన్ మొహమ్మద్ గౌసోద్దీన్ డిసిసి బ్యాంక్ మేనేజర్ కే వెంకటేశం సీఈవో ని సార్ అహ్మద్ మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు బొరేగావ్ సంగన్న పటేల్ వనంపల్లి నర్సింలు పటేల్ డైరెక్టర్ మొహమ్మద్ సోహెల్ సిబ్బందులు రమేష్ చారి షేక్ సులేమాన్ నవీన్ కుమార్ మరియు లబ్ధిదారులు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.