ప్రమాణ స్వీకారం చేసిన పల్లా, రాంచంద్రరావు
హైదరాబాద్:నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచిన రామచంద్రరావులు ఈ రోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు.