ప్రమాదవశాత్తు వాహనం పై చెట్టు పడి ఇద్దరు మృతి

మృతులు జగిత్యాల్ జిల్లా రాయికల్ మండల వాసులు

ఖానాపూర్ రూరల్ 11 సెప్టెంబర్(జనం సాక్షి): ప్రమాదవశాత్తు టటా మ్యాజిక్ పై చెట్టు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో ని ఇక్బల్ పూర్ లో చోటు చేసుకుంది.జగిత్యాల్ జిల్లా రాయికల్ మండల్ ఇటిక్యాల గ్రామానికి చెందిన 12 మంది స్నేహితుల తో కలసి బుచ్చిరాజం కు చెందిన టాటా మ్యాజిక్ TS 15 UA 1388 వాహనం ను కుంటాల వాటర్ ఫాల్ లో విందు భోజనానికి అని పది గంటల నలబై ఐదు నిమిషాలకు వారి గ్రామం ఇటిక్యాల నుండి బయలుదేరగా ఆదివారం బారి వర్షం కురుస్తున్న సమయంలో సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న బారి వృక్షం టాటా మ్యాజిక్ ముందు భాగం లో పడింది దీంతో డైవర్ బుచ్చి రాజం అక్కడికక్కడే మృతిచెందాడు, ముందు భాగంలో కూర్చున్న వుట్నూరి రవి,పందిరి నిఖిల్ విరు ఇద్దరు క్యాబిన్ లో ఇరుకోగా గ్రామస్తులు పోలీసులు బయటకు తీయగా వారికి తీవ్ర రక్త స్రావం జరుగగా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వుట్నూరి రవి చనిపోయాడు.పందిరి నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు.మృతుడు బుచ్చిరాజం కు ఇద్దరూ భార్యలు మొదటి భార్యకు ఇద్దరు కూతుర్లు, రెండవ భార్యకు ఒక కొడుకు ఉన్నారు.మృతుడు వుట్నూరి రవి కి భార్య ఒక కూతురు,కుమారు ఉన్నారు.అదే వాహనంలో ఉన్న వుట్నూరి మనీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రజినీకాంత్ తెలిపారు.