ప్రయాణికునికి గుండెపోటుతో అత్యవరంగా ల్యాండ్ చేసిన విమానం
హైదరాబాద్: దుబాయి నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. చికిత్స కోసం ప్రయాణికున్ని విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెప్పారు.