ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: ఆర్జీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు కార్మికులు పెద్దసంఖ్యలో డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ ఆయా కేంద్రాల్లో 30 నుంచి 50 శాతం ఓట్లు నమోదైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విశాఖ రీజియన్‌ పరిధిలోని 9 డిపోల్లో 40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చెప్పారు. పోలీంగ్‌ కోసం కార్మిక శాఖ, ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో 10 సంఘాలు పోటీ పడుతుండగా టీఎంయూ, ఎంప్లాయిన్‌  యూనియన్‌ కూటమి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6.30కు చేపట్టనున్నారు.