ప్రశ్నించే గొంతుకులను అణచివేయడం హేయమైన చర్య
ప్రశ్నించే గొంతుకులను అణచివేయడం హేయమైన చర్య * కెసిఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం* జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
టేకులపల్లి, మార్చి 23( జనం సాక్షి): ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని చూసే కెసిఆర్ ప్రభుత్వ ధరణి హేయమైన చర్యని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న జగన్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలను, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీస్ వ్యవస్థపై, ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనం అని, పోలీసు వ్యవస్థను పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా మలుచుకుంటూ ప్రజలు ప్రతిపక్షాలపై అనగదొక్కే ధోరణి అవలంబించడం దారుణమైన చర్యగా ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమెను అరెస్టు చేసిన తర్వాత మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడం చేతగాని దద్దమ్మలు, ప్రశ్నించే గొంతుకులను ఇలా పోలీసుల చేత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ, పంట పొలాలకు నష్టపరిహారం ప్రకటించడానికి వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత భయం ఎందుకు, కాంగ్రెస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం దేనికి,పోలీస్ స్టేషన్లకు తరలించడం దేనికి, లిక్కర్ స్కామ్లు, పేపర్ లీకులు వై స్పందించని ఈ ప్రభుత్వం ఇలా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసి తప్పును కప్పి పుచ్చుకోవడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.