ప్రాథమిక పాఠశాల సుపరిపాల దినోత్సవం .

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి:):—– ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నెంబర్ 2 గాంధీనగర్ పాఠశాల నందు స్వయం సపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి సిఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల వినోద్ గారు సిడబ్ల్యుసి చైర్పర్సన్ శ్రీమతి బండారు జయశ్రీ గారు గారు సిపిడిఓ సైదులు గారు పాఠశాల ఎక్స్ అఫీషియో సభ్యులు కాచరాజు జయప్రకాష్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లబోతుల శ్రీధర్ గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ఈనాడు నిర్వహించిన స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఆవుల వినోద్ గారు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచడానికి అందరం కృషి చేయాలని పేర్కొనడం జరిగింది సిడబ్ల్యుసి మేడం బండారు జయశ్రీ గారు మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియజేశారు విద్యార్థులు అందరూ బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం దివిస్ కంపెనీ వారు సప్లై చేసిన వాటర్ బాటిల్స్ ను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది.