ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలి.
ప్రభుత్వ స్థలాలో ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలి.
టిడిపి జిల్లా మాజీ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల.
టిడిపి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి. జనంసాక్షి:
నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనేక ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని,వారి చెర నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని తెలుగు దేశం పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల డిమాండ్ చేశారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో పట్టణంలో పుట్ పాత్ వ్యాపారాల పేరుతో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ కొప్పుల మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శ్రీపురం రోడ్డు చౌరస్తాలో ఆర్డీవో ఎంపీడీవో కార్యాలయం ప్రహరీగోడ వద్ద కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను మురుగు కాలువలను ఆక్రమించుకొని వాటిపై షెడ్లు ఏర్పాట్లు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నా రని అన్నారు.ఆ స్థలాల్లో వేసుకున్న షెడ్ల ముందు వివిధ రకాల వాహనాలు నిలపడం వలన ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదని అన్నారు.మరియు ఎంపీడీవో కార్యాలయం గేటు వద్ద షెడ్లు ఏర్పాటు చేయడం వలన కార్యాలయం ఆవరణంలో ఉన్న 108 వాహనం ఎంపీడీవో కార్యాలయం బయటకి లోపలికి వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్యాలయాల ముందు షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేయడం వలన వివిధ పనుల నిమిత్తం కార్యాలయ పేరుగల బోర్డులు ప్రజలకు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.వీధి వ్యాపారుల సంక్షేమానికి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గోడ ప్రక్కన పురపాలక సంఘం కార్యాలయం నుంచి షెడ్డులు నిర్మించి వ్యాపారాలు చేసుకోమని అప్పజెప్పి అందులో కొంతమంది వ్యక్తులు తమ వ్యాపారాలను షెడ్డులో చేయకుండా రోడ్డుపైన వివిధ రకాల వస్తువులను విక్రయించడం వలన ప్రధాన రహదారిపై వెళ్లే వ్యక్తులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తమరి స్థాయిలో పరిశీలన చేసి రహదారి స్థలాలను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై సరైన చర్యలు తీసుకొని పట్టణంలోని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ మాజీ కార్యదర్శి డి బాలకృష్ణ జిల్లా మాజీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి జాఫర్ చంద్రశేఖర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు